Sunday, 31 December 2017

నూతన సంవత్సర శుభాకాంక్షలు

2017 వ సంవత్సరం గత సంవత్సరంగా మారుతున్న వేళ, కొత్తగా 2018 సంవత్సరంలోకి అడుగులు వేయడానికి ఉన్నది కొద్ది సమయం మాత్రమే. విషయాలు విశేషంగా ఉంటే, అవి కొంతమందికి సంతోషం కలిగిస్తే, కొంత మందికి కష్టం కలిగించవచ్చును. గత కాలపు కష్టాలు, రాబోయే కాలంలో కరిగి పోయి, గత కాలపు సంతోష క్షణాలు, రాబోయే కాలంలో మరిన్ని కలగాలని కోరుకుంటు, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

క్రోమ్ కాస్ట్ వీడియో స్ట్రీమింగ్ డివైజ్

క్రోమ్ కాస్ట్ తో మీ మొబైల్ లేదా టాబ్స్ నందు కనిపించే స్క్రీన్, మీ టీవీ లో చూడడానికి ఉపయోగపడుతుంది. మీ మొబైల్ లేదా టాబ్స్ నందు మీరు ఆడే గేమ్స్ లేకా చూస్తున్న వీడియోలు పెద్ద స్క్రీన్ పై అంటే టీవీ లో చూడవచ్చు లేదా గేమ్స్ ఆడవచ్చు, అయితే మీ టీవీ లో హెచ్ డి ఎమ్ ఐ పోర్టు ఉండాలి. ఇది గూగుల్ సంస్థ యొక్క ఉత్పాదన, మరియు బాగా ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే ఇది స్మార్ట్ ఫోన్ ద్వారా మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మారుస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు మీ మొబైల్ నుండి మీ టీవీలో ప్రసారం చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వెబ్ సైట్లు పెద్ద స్క్రీన్ పై చూడవచ్చును. ఇది ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ యాప్ / వెబ్ సైట్ లో లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ యాప్ ఆఫర్లు

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ యాప్ / వెబ్ సైట్ లో వివిధ రకాల మొబైల్స్ పై  న్యూ ఇయర్ ఆఫర్లు లభించనున్నాయి. ఈ ఆఫర్లు జనవరి 3వ తేదీ నుంచి లభించును.

Monday, 25 December 2017

గరుడ పురాణం మీ మొబైల్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

గరుడ పురాణం పిడిఎఫ్ ఫార్మాట్లో మీ మొబైల్ లేదా టాబ్స్ నందు ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చదువు కోవచ్చు, ఈ ఆప్ కు సంబంధించిన లింకు క్రింద ఇవ్వబడినది.

పురాణం చదవడం చేయడం ఒక మంచి పని అయితే
పురాణం పూర్తిగా చదవడం మరొక మంచి పని అయితే
చదివిన పురాణాన్ని సరిగా అవగాహన చేసుకొని, అందులోని
సారం గ్రహించడం  మాత్రం అదృష్టవంతులకే సాద్యం అయితే
పురాణం పూర్తిగా మనిషి మనస్సును మంచిగా మారుస్తుంది.

గరుడ పురాణం https://www.freegurukul.org/view-book/1155/GarudaPuranamu/17 From Free Gurukul Android App.

Friday, 22 December 2017

క్లిక్ చేయగానే సిస్టం, టచ్ చేస్తే మొబైల్ ఫోన్ వాడుకలోకి వచ్చింది

క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యేది డెస్క్ టాప్ అప్లికేషన్ అయితే టచ్ చేస్తే చేతిలో కనబడేది మొబైల్ అప్లికేషన్ అయితే, కంటికి కనబడకుండా అజ్ఞాతంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండి పని చేయించే అజ్ఞాతవాసి సాప్ట్ వేర్. అలా అజ్ఞాతంలో ఉండి బయటి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటున్న విషయాలు, జరుగుతున్న విశేషాలను తెలియజేస్తూ సిటిజన్లను నెటిజన్లుగా, మాములు మనిషిని స్మార్ట్ మనిషిగా మార్చేసింది, ఈ అజ్ఞాతవాసి అయిన సాప్ట్ వేర్.

తనను గురించి తనకు తెలియకుండానే ఉండే వ్యక్తి నష్టపోయినట్లు, టెక్నాలజీ గురించి తెలియకపోయినా అంతే. అయితే మనసును పోలి పని చేసే సాప్ట్ వేర్ అప్లికేషన్ కూడా, మనసుకు పరిచయం అవ్వడం తరువాయి,  సాప్ట్ వేర్ తో సాన్నిహిత్యం పెరిగిపోతోంది. ఫలితం కోసం చూసే పోటికి నియమాలతో కూడిన శిక్షణ కానీ, కేవలం తెలుసుకోవడానికి అయితే, మనకి గూగుల్ గురు చాలు.

శిక్షణలోను ఉండేది సాప్ట్ వేర్ పరిచయమే, పట్టుకోవడం, ప్రాక్టీస్ చేయడం శిక్షణ పొందే వారికి ఉండే శ్రద్ధను బట్టి ప్రతిభా పాటవాలు ఉంటాయి.

Thursday, 21 December 2017

గూగుల్ సెర్చ్ ఇంజన్ గురించి తెలుసుకుంటే

గూగుల్ అంటే ఒక సెర్చ్ ఇంజన్ అనే స్ధాయిలో నుండి గూగుల్ అంటే ఒక ఇంటర్ నేషనల్ ఇంటర్నెట్ సంస్థ అయి, ఈ సంస్థ నుండి అనేక రకాల ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. గూగుల్ గురించి చెప్పడం అంటే, రోజు భోజనం చేసినట్లు, కొంత కాలం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. గూగుల్ సెర్చ్ ఇంజన్ గురించి తెలుసుకుంటే.

మనం గూగుల్ సెర్చ్ ఇంజన్ గురించి చెప్పాలంటే, ఇది అందరి గురించి, అన్నింటినీ గురించి వెతికి పట్టుకొని తీసుకుని స్క్రీన్ పై చూపే వ్యవస్థ. నెటిజన్లకు నీరు లాంటిది, సిటిజన్స్ కు సీరియల్ లాంటిది. అంతర్జాలం అంటే అంతర్జాతీయంగా అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్. కంప్యూటర్ కానీ, లాప్ టాప్ కానీ, టాబ్లెట్, ఫ్యాబ్లెట్, ఫోన్ కానీ ఎందులో ఏది వెతకాలి అంటే అందుబాటులో ఉండే విధంగా రూపొందించబడి ఉంటుంది ఈ గూగుల్ సెర్చ్ ఇంజన్. వెతికే విషయాలను అనుసరించి, వాటిలో ఉన్న విశ్లేషణ, విశేషాలు ఆధారంగా, ఎక్కడ, ఎన్ని విధాలుగా ఉందో చూసి, వెతుకుతున్న విషయం యొక్క అన్ని రకాల విశేషాలు క్లుప్తంగా వెతికే చోట చేర్చి చూపుతుంది. క్లుప్తంగా కనిపించే ఆ విశేషాల పై క్లిక్ చేస్తే, దానికి సంబంధించిన వివరాల్లోకి తీసుకుని వెళ్ళే వరకూ, ఈ గూగుల్ సెర్చ్ ఇంజన్ పని.

వెతుకుతున్న విషయం యొక్క ప్రమాణాలు కూడా గూగుల్ సంస్థ రూపొందించిబడి లేదా రూపొందించడం చేస్తూ ఉంటుంది. ఇంకా విషయాలు అనేకం ఉంటాయి కాబట్టి, ప్రస్తుతం ప్రాచుర్యం పొందిన విషయాలు ఏమిటి అనేది కూడా మనం ఈ గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. విషయంపై వివరాలు, విశ్లేషణాత్మక కధనాలు, విషయ పరిచయం, ఉత్పత్తులు, వాటి రూపకల్పన, వాటి యొక్క పనితీరు, రాబోయే ఉత్పత్తులు, వాటిలో ఉండే ఉపయోగాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల విభాగాల్లో వివిధ విషయాలను మనం తెలుసుకోవచ్చు.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందినది

ఇంటర్నెట్ అనగానే ముందుగా కావాల్సింది బ్రౌజర్, మనకి కావాల్సిన వెబ్ సైట్ ఓపెన్ చేసి చూసుకోవడానికి ఉపయోగపడే అప్లికేషన్ బ్రౌజర్. అలాంటి బ్రౌజింగ్ కోసం రూపొందించిన అప్లికేషన్స్ కొన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఓపెరా, UC బ్రౌజర్ మొదలైనవి, ఇవి డెస్క్ టాప్, టాబ్ మరియు మొబైల్ ఫోన్లకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించబడి ఉంటాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసిన అప్లికేషన్, ఫైర్ ఫాక్స్ మొజిల్లా తయారు చేసిన అప్లికేషన్, క్రోమ్ గూగుల్ సంస్థచే రూపొందించబడింది.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్కువ మంది నెటిజన్లకు పరిచయం, కొంతమందికి మాత్రం బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ అని అనుకునే అంతగా క్రోమ్ ప్రాచుర్యం పొందింది. వేగంగా కావాల్సిన వెబ్ సైట్ కంటెంట్ లోడ్ చేయుటకు క్రోమ్ బాగా ఉపయోగపడుతుంది, అలాగే వెబ్ సైట్లు ఉండే వీడియోలు ప్లే చేయడానికి క్రోమ్ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

క్రోమ్ గూగుల్ సంస్థచే రూపొందించబడింది, గూగుల్ సెర్చ్ ఇంజన్, యూట్యూబ్, ప్లే స్టోర్, జీమెయిల్, డ్రైవ్, మ్యాప్స్, ఫొటోస్, మొదలైన గూగుల్ ప్రొడక్ట్స్ క్రోమ్ బ్రౌజర్ నందు బాగా పని చేస్తాయి.

గూగుల్ క్రోమ్ డెస్క్ టాప్ వెర్షన్ నందు వివిధ రకాల ఆప్స్ లభిస్తాయి, వాటిని క్రోమ్ నందు యాడ్ చేసిన, వివిధ రకాలుగా క్రోమ్ బ్రౌజర్ బాగా ఉపయోగపడుతుంది.

Monday, 18 December 2017

మీ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఉపయోగ పడుతుంది

మీరు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్నారు, అది మీకు బాగా నచ్చినది, ఫ్రెండ్స్ తో పంచుకున్నారు, అయినా ఆ వస్తువు యొక్క ఉపయోగం బాగా నచ్చింది, ఇంకా ఎవరికైనా చెప్పాలంటే ఎలా? అయితే మీ ఫ్రెండ్స్ తో నేరుగా మాట్లాడటంలా కాకుండా మొబైల్ ఆప్ లో మీరు మీ పరికరం గొప్పతనాన్ని రివ్యూ గా వ్రాయడం చేయవచ్చు. అలా మీకు బాగా ఉపయోగపడే వస్తువులను (మొబైల్, ట్యాబ్, కంప్యూటర్,లాప్ టాప్, టీవీ మొదలైనవి) గురించి మీకు నచ్చితే ఎందువల్ల, దాని వల్ల ఉపయోగాలు తెలియజేయవచ్చు, నచ్చకపోతే కూడా మీకు ఎందువల్ల, దాని వల్ల నష్టం తెలియజేయవచ్చు.

అలాంటి ఆప్స్ ఒకటి మౌత్ షట్ (Mouth shut) పేరుకు తగ్గట్టుగానే ఇందులో వివిధ రకాల విభాగాల్లో వివిధ వస్తువులను, సాప్ట్ వేర్, రెస్టారెంట్లు, టూరిస్ట్ మొదలైనవి విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. మీరు కూడా మీ అభీష్టం ఈ ఆప్ లో పంచుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా వస్తువు కొనాలి అన్నా ఈ ఆప్ నుంచి వెతికి రివ్యూస్ చదివి, ఆ వస్తువు పనితీరు అంచనా వేయవచ్చు. ఈ క్రింద వీడియో లింక్ లో మొబైల్ ఫోన్ రివ్యూ ఎలా ఉంటుందో చూడండి.

https://youtu.be/TIQcYPUr0j4

తాజా వార్తలను స్మార్ట్ ఫోన్లో చదువు కోవడానికి

తాజా వార్తలను స్లైడ్ షో రూపంలో మనం ట్యాప్ చేస్తే న్యూస్ మారే విధంగా మన ఫోన్లో మనం చూడవచ్చు. Way2sms వెబ్ సైట్ ఉంది కదా, దీని ద్వారా ఉచితంగా ఎస్ ఎమ్ ఎస్ లు మన ఫ్రెండ్స్ కి పంపించవచ్చు, ఈ వెబ్ సైట్ యొక్క మొబైల్ ఆప్ ప్లే స్టోర్లో way2online గా Way2sms, Free SMS-Daily News పేరుతో లభిస్తుంది.

ఈ ఆప్ మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ ఫీడ్ స్లైడ్ షో గా మీ ఫింగర్ స్క్రీన్ పై పైకి ట్యాప్ చేసి చదువు కోవచ్చు, అలాగే మీ మొబైల్ నెంబర్ ఈ ఆప్ లో రిజిస్టర్ చేసుకుని ఉచితంగా ఎస్ ఎమ్ ఎస్ లు పంపుకోవచ్చు. మీకు నచ్చిన న్యూస్ ఫీడ్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగలరు.

https://youtu.be/qB1GL3Lq9_g

ఫోన్ల ఫీచర్స్ బట్టి ఫోన్ ఎంపికకు ఉపయోగపడే ఆప్

మనం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే విషయంలో అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక ఫోన్ కొనుగోలు చేసేస్తాం, ఒకొక్క సారి మంచి ఫోన్ కొనడం చేయవచ్చు అప్పుడు పర్వాలేదు, కానీ ఒకొక్క సారి కొన్న ఫోన్లో మనకు కావలసిన ఫీచర్స్ ఉండకపోవచ్చు, అప్పుడు ఇబ్బంది పడుతూ ఫొన్ వాడాలి. అలా కాకుండా మనం ఆన్ లైన్ వెబ్ సైట్ లేదా మొబైల్ ఆప్ లో కొత్తగా విడుదల అయిన ఫోన్లు వాటి వివరాలు తెలుసు కోవచ్చు.

అలా తెలియజేసే ఆప్ 91 మొబైల్స్ ఆప్ గురించి చూస్తే, ఈ ఆప్ ని సుమారు ఒక మిలియన్ ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. కొత్తగా విడుదల అయిన ఫోన్లు, విడుదల కాబోయే ఫోన్లు గురించి వివరాలు, విశ్లేషణ ఈ ఆప్ నుంచి తెలుసు కోవచ్చు. అలాగే మనం స్మార్ట్ ఫోన్లు ఒకదానితో ఒకటి పోల్చి ఫీచర్స్ తెలుసు కోవచ్చు, అలాగే ఆయా ఫోన్ల ఎంత ధరలో ఏఏ ఇకామర్స్ వెబ్ సైట్లు నుంచి లభించే అవకాశం ఉంది తెలుసుకుని, అక్కడ నుండి వచ్చిన ధర లభించే స్టోర్ లో వెళ్లి కొనుగోలు చేయవచ్చు.

ఇంక మీరు ఆప్ మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, క్రొత్త ఫోన్ల వివరాలు, ప్రైస్ డ్రాప్ అలర్ట్స్ పొందవచ్చు. రెండు లేదా మూడు ఫోన్లు ఎలా పోల్చి చూసుకోవడం వీడియో లింక్ క్రింద ఇవ్వబడినది.

https://youtu.be/qyeYWgqnnIg

పురాణ పుస్తకాలను ఇ బుక్స్ గా మీ మొబైల్ పొందేందుకు అవకాశం

తెలుగులో భక్తి పుస్తకములు అందించే ఆండ్రాయిడ్ అప్లికేషన్ 3500 Free Telugu Bhakti Books అనే పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది, వేల కొలది ఇ బుక్స్ ఈ ఆప్ నుంచి ఉచితంగా లభిస్తాయి. జ్ఞానార్జన కోసం వెతికే ప్రయత్నం చేసే వారికి ఈ ఆప్ నుంచి మంచి ఇ బుక్స్ లభిస్తాయి.

ఈ ఆప్ లో Category, Search, Recent Read, Offline Books, Favourites, Download, My Activity, Submit E Book, Comments, Share App పేర్లు కలిగి ఐకాన్లు ఉంటాయి, ఇక్కడ కేటగిరీ అనే పేరుతో కనిపించే ఐకాన్ పై టచ్ చేస్తే వచ్చే మెనులో వివిధ రకాల విభాగాలు వారీగా విభజన చేసి పేర్లతో ఉంటాయి, ఆ విభాగాల్లో కనిపించే మెనూ ఐకాన్ పై టచ్ చేస్తే, ఆ విభాగాల్లో వివిధ పుస్తకాలు ఉంటాయి, అక్కడ పుస్తకం ప్రక్కన ఉన్న ఏరో గుర్తుపై టచ్ చేస్తే, ఆ బుక్ మొబైల్ నందు డౌన్లోడ్ అవుతుంది. ఇలా అన్ని రకాల విభాగాలు వారీగా ఉన్న పుస్తకాల జాబితా లో వెతికి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ డౌన్లోడ్ చేసుకున్న పుస్తకాలు, అదే ఆప్ నందు ముందుగా చెప్పినట్లు, ఆప్ ఓపెన్ చేయగా వచ్చిన మెనులో ఉన్న Offline Books పేరుతో కనిపించే ఐకాన్ పై టచ్ చేస్తే, అంతకుముందు కేటగిరీ మెనులో వెతికి డౌన్లోడ్ చేసుకున్న పుస్తకాలు ఇక్కడ ఉంటాయి, ఇక ఇక్కడ మీ ఇష్టమైన పుస్తకం మీ ఫోన్లో చదువు కోవచ్చు. ఈ పుస్తకం పై ఒక మెనూ కనిపించే ఐకాన్ లో కుడి చివర పై భాగాన పేజీ రూపంలో ఉన్న గుర్తుపై టచ్ చేస్తే, ఆ పుస్తకం Pdf లో ఓపెన్ అవుతుంది. Pdf చదువు కోవడానికి అనుకూలంగా ఉంటుంది.

మీ దగ్గర ఏదైనా పుస్తకం ఉంటే, ఆ పుస్తకాన్ని మీరు ఇ బుక్ గా మార్చి, ఈ ఆప్ లో ఆప్ లోడ్ చేయుటకు అవకాశం కలదు.

https://youtu.be/pV8EZkgvhzE

Saturday, 16 December 2017

వాట్సాప్ వాడుక ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది

వాట్సాప్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫోటోలు, చిన్న సైజ్ వీడియోలు, టెక్స్ట్ సందేశాలను పంపడం, అంతే కాకుండా దీనిలో భాగంగా మనం మనకోసం ప్రత్యేక కాంటాక్ట్స్ కలిపి గ్రూప్ రూపొందించవచ్చు. ఫేస్ బుక్ వాడే వారికి ఈ గ్రూప్ చాటింగ్ గురించి అవగాహన ఉంటుంది, అయితే ఈ గ్రూపులో ఉన్న  ఒకరు, అదే గ్రూపులో ఉన్న మరొకరితో చాటింగ్ చేస్తూ ఉంటే, ఆ చాటింగ్ వివరాలు మొత్తం గ్రూపులో మిగిలిన సభ్యులకు చేరుతాయి. ఈ గ్రూప్ చాటింగ్ అంటే కనబడకుండా కొందరు ఒకే చోట సంభాషణలు చేసుకున్నట్లు ఉంటుంది. గ్రూప్ చాటింగ్ నందు కూడా ఫోటోలు, చిన్న సైజ్ వీడియోలు, పంపవచ్చు.

అలాగే మీరు మీ వాట్సాప్ ఆప్ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ లో ఓపెన్ చేసి, వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ కుడి వైపు పై భాగాన మూలంలో నిలువుగా కనిపించే మూడు చుక్కల పై టచ్ చేస్తే వచ్చే మెనులో (whatsApp Web) వాట్సాప్ వెబ్ అని ఉంటుంది. ఎలా కంప్యూటర్ తో అనుసంధానం చేసి వాడుకోవచ్చు తెలుసుకుందాం.

మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ కానీ, లాప్ టాప్ కానీ మీరు బ్రౌజర్ (ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఓపెరా మొదలైనవి) ఓపెన్ చేసి, మీ బ్రౌజర్ అడ్రస్ బార్ నందు web.whatsapp.com అని టైపు చేస్తే, మీకు అక్కడ ఒక QR Code వస్తుంది, ఇప్పుడు పైన చెప్పిన విధంగా మీ వాట్సాప్ ఆప్ లో వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ టచ్ చేస్తే స్కానింగ్ మోడ్లో కెమెరా ఓపెన్ అవుతుంది, ఇప్పుడు మీ కంప్యూటర్ కనిపించే QR code ని మొబైల్ ఓపెన్ అయిన  కెమెరాకు ముందుగా తీసుకుని చూస్తే, కంఫ్యూటర్లో కనిపించే QR Code వాట్సాప్ కెమెరా విండో తో మ్యాచ్ కావడంతో, మీ వాట్సాప్ ఆప్ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ నందు ఓపెన్ అవుతుంది. మీ వాట్సాప్ ఆప్ లో లాగిన్ అయిన ఖాతా వివరాలే ఆ కంఫ్యూటర్లో కనిపిస్తుంటాయి. వాడకం పూర్తి అయిన తరువాత మీ ఖాతా లాగౌట్ చేసుకోవచ్చును.

ఇందులో మీరు మీ ఖాతా యూజర్ నేమ్ తో పాటు మీకు నచ్చిన ఫోటో మీ ఖాతాకు జత చేసుకోవచ్చు. ఇంకా మీ వాట్సాప్ ఆప్ చాటింగ్ విండో బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ మార్చుకోవచ్చు, ఎలాగో చూద్దాం.

పైన చెప్పిన విధంగా మీ వాట్సాప్ ఆప్ కుడి వైపు పై భాగాన మూలంలో నిలువుగా కనిపించే మూడు చుక్కల పై టచ్ చేస్తే వచ్చే మెనులో సెట్టింగ్స్ పై టచ్ చేస్తే వచ్చే మెనులో మీ ఖాతా పేరు ఉండి, పేరుకు ఎడమవైపు గుండ్రంగా ఉన్న చోట టచ్ చేస్తే, అదే గుండ్రని ఆకారం పెద్దగా అవుతుంది, ఇప్పుడు ఆ పెద్ద రౌండ్లో టచ్ చేస్తే, కెమెరాతో అయితే ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చును. అయితే గ్యాలరీ ద్వారా ఇంతకు ముందే ఉన్న ఫోటో ప్రొఫైల్ ఫోటోగా మార్చుకోవచ్చు.

ఇంకా చాటింగ్ విండో ఇమేజ్ మార్చాలంటే, పైన చెప్పిన విధంగా సెట్టింగ్స్ మెనూ కనిపించే Chat అక్షరాలను టచ్ చేస్తే, ఇంకో మెనూ వస్తుంది, అక్కడ wallpaper అని కనిపించే అక్షరాలను టచ్ చేస్తే వచ్చే ఆప్షన్లు: Gallery, Solid Color, Wallpaper Library, Default, No Wallpaper వీటిలో మొదటి మూడు ఆప్షన్లు నుండి మీకు నచ్చినట్లు బ్యాక్ గ్రౌండ్ మార్చుకోవచ్చు, చివరి రెండు ఆప్షన్స్ ఎంచు కుంటే మాత్రం బ్యాక్ గ్రౌండ్ వైట్ కలరే ఉంటుంది.

వాట్సాప్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది.

అరచేతిలో అన్నింటినీ చూపించే విధంగా ఆకర్షణీయమైన

స్మార్ట్ ఫోన్, ఈ రోజుల్లో ప్రతి వారి జేబులో పెన్ ఉండకపోవచ్చు కానీ ఫోన్ తప్పనిసరి అయింది, వారిలో స్మార్ట్ ఫోన్లు వాడే వారు ఎక్కువగా ఉంటారు. అయితే ఒకప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువ కాలం వాడడానికి ఇష్టపడితే, ఈ స్మార్ట్ సమయంలో మాత్రం కొత్తగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ అందరికి ఆకర్షణ కలిగించే విధంగా ఉండడం వల్ల లేక చేతిలో ఉన్న డివైజ్ ఫీచర్స్ వలన ఉపయోగం తక్కువగా ఉండడం వలన, లేదా తక్కువ సమయంలోనే టెక్నాలజీ కొత్త కొత్త మార్పులు చేసుకోవడం కారణం కావచ్చు. ఏది ఏమైనా స్మార్ట్ ఫోన్ వినియోగి చేతుల్లో కొంత కాలం పాటే ఉంటే టాబ్స్ మాత్రం ఫోన్ వాడే కాలం కన్నా ఎక్కువ కాలం వాడడం జరుగుతుందని చెప్పవచ్చు.

ఇంక ఈ మధ్య కాలంలో విడుదల అయి ప్రాచుర్యం పొందిన మొబైల్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. అయితే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ బట్టి వివిధ రకాలుగా లభిస్తున్న మొబైల్ ఫోన్ల గురించి క్లుప్తంగా.

లెనోవా మొబైల్ ఫోన్లు.

కె8 ప్లస్ (Lenova K8 Plus)

మంచి ఫోన్ ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మనకు లభించే ఈ ఫోన్ ప్రత్యేక తేదీల్లో ఆఫర్లు ఉన్నప్పుడు తక్కువ ధరలో లభిస్తుంది. ధరకి తగిన ఫీచర్స్ కలిగి అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో లెనోవా కె8 ప్లస్ మంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సెప్టెంబర్ 2017న విడుదల అయి ప్రాచుర్యం పొందింది.

ఫీచర్స్: 5.2" హెచ్ డి డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, 13 మెగా పిక్సెల్ డబుల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ ఫ్లాష్, డ్యూయల్ సిమ్, నానో సిమ్ టైపు, 4జి, 3జి, 2జి నెట్వర్క్స్, 3జిబి ర్యామ్, వైఫై, మొబైల్ హాట్ స్పాట్, 4000mAh బ్యాటరీ సామర్థ్యం, 2.6 GHz ఆక్టా కోర్ ప్రొసెసర్,32జిబి ఫోన్ మెమోరి, 128జిబి సామర్థ్యం కలిగిన మెమోరి కార్డు స్లాట్, డ్యూయల్ ఫ్లాష్, డాల్బీ సౌండ్ సిస్టం, కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓఎస్ తదితర అంశాలు కలిగి ఉంది.

పదివేల రూపాయల ధరలో ప్రత్యేక వాటిలో స్మార్ట్ ఫోన్లు
లెనోవా కె5 నోట్, లెనోవా బ్యాడ్ 2, లెనోవా కె6 పవర్, లెనోవా కె8 ప్లస్ మంచి ప్రాచుర్యం పొందాయి.

షియోమి మొబైల్ ఫోన్లు.

షియోమి రెడ్ మి 4ఏ, 5ఏ (Redmi 4A, 5A)

Redmi 5A ఈ డిసెంబర్ 7న విడుదల అయితే Redmi 4A మార్చి 2017 లో విడుదల అయి ప్రాచుర్యం పొందింది. ఏవరేజ్ యుసేజ్ కావాల్సిన వారికి ధర తక్కువ మంచి ఫీచర్స్ కలిగి ఈ ఫోన్లు మంచి ఆకర్షణ కలిగించే విధంగా ఉంటాయి.

ఫీచర్స్: 1.4 GHz ఫాస్ట్ ప్రొసెసర్, 2 జిబి ర్యామ్, 16జిబి ఫోన్ మెమోరి, అదనపు మెమోరి కార్డు స్లాట్ 128 జిబి వరకు, డబుల్ సిమ్, 4జి,3జి 3000mAh బ్యాటరీ సామర్థ్యం, అయిదు అంగుళాల కెపాసిటివ్ డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, మైక్రో యుఎస్బి, వైఫై, జిపిఎస్, ఆండ్రాయిడ్ 7 తదితర అంశాలు కలిగి ఉంటాయి.
Redmi 5A లో మాత్రం కంపాస్ కలిగి ఉంటుంది.

నోట్: పై తెలియజేయబడిన ఫీచర్స్ కలిగి, ర్యామ్, ఫోన్ మెమోరి పెంచి కొంచెం ఎక్కువ ధరలో లభిస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ లేదు.

రెడ్ మి 4ఏ అమెజాన్ వెబ్ సైట్ (ఆప్), రెడ్ మి 5ఏ ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ యాప్ (వెబ్ సైట్) నందు సరైన ధరలో ప్రత్యేక తేదీల్లో లభిస్తాయి.

షియోమి రెడ్ మి (Redmi Y1 light).

అమెజాన్ వెబ్ సైట్ మరియు ఆప్ ద్వారా ఈ ఫోన్ ప్రత్యేక తేదీల్లో లభిస్తుంది, ఇది నవంబర్ 2017న విడుదల అయి ప్రాచుర్యం పొందింది. అయిదున్నర అంగుళాల తాకే తెర, గొరిల్లా గ్లాస్, మిగిలిన ఫీచర్స్ పైన చెప్పిన రెడ్ మి 5ఏ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

2జిబి - 16జిబి, 3జిబి - 32జిబి, 4జిబి - 64జిబి వరుసలో ర్యామ్ - ఫోన్ మెమోరి ఆధారంగా కొంత ధరల తేడాతో ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మనకు లభిస్తాయి.

షీయోమి నుండి వచ్చి ఆదరణ పొందిన మొబైల్ ఫోన్లు, రెడ్ మి 4, రెడ్ మి 4ఏ, రెడ్ మి నోట్ 4, రెడ్ మి 5, రెడ్ మి 5ఏ, ఎమ్ ఐ ఏ1, ఎమ్ ఐ మాక్స్ 2 మొదలైనవి.

నోకియా మొబైల్ ఫోన్లు.
నోకియా 3 (Nokia 3).

ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మొబైల్ రారాజు అని చెప్పబడే సంస్థ నోకియా కంపెనీ తమ ప్రొడక్ట్స్ మరలా విడుదల చేసిన వాటిలో ఒక స్మార్ట్ ఫోన్ నోకియా 3 మోడల్, విడుదల అవ్వబోయే ముందు ఆసక్తి కలిగించింది.
నాణ్యత కలిగిన మొబైల్ అంటే నోకియా కంపెనీ మొబైల్ ఫోన్ అని చెప్పే మాటలు ఆన్ లైన్ షాపింగ్ రాకముందే ఉన్నాయి అని అంటారు.

ఫీచర్స్: 1.3 క్యాడ్ కోర్ ప్రొసెసర్, 64 బిట్, 16జిబి ఫోన్ మెమోరి, 128 జిబి వరకు సామర్థ్యం కలిగిన మెమోరి కార్డు స్లాట్, 4జి,3జి,2జి నెట్ వర్క్, 2జిబి ర్యామ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 8 మెగా పిక్సెల్ కెమెరా, బ్యాక్ ఫ్లాష్, ఫ్రంట్ ఫ్లాష్ లేదు, జిపిఎస్, కంపాస్, డ్యూయల్ సిమ్, హెచ్ డి డిస్ప్లే, 2630 mAh బ్యాటరీ సామర్థ్యం, మొబైల్ హాట్ స్పాట్, మైక్రో యుఎస్బి, అయిదు అంగుళాల తాకే తెర ఆధారంగా స్మార్ట్ ఫోన్ మనకు ఆండ్రాయిడ్ 7తో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ నెక్స్ట్ అప్డేట్ లభించే అవకాశం ఉంటుంది.

ఇంకా నోకియా 2, నోకియా 5, నోకియా 6 మొదలైనవి లభిస్తున్నాయి.

సామ్సంగ్ గెలాక్సీ జె7 ఎన్ ఎక్స్ పి (Samsung Galaxy J7 NXT)

అయితే ఒక అప్పటి మొబైల్ రారాజు నోకియా తర్వాత స్థానంలో నిలిచి, గూగుల్ ఆండ్రాయిడ్ వచ్చాకా మార్కెట్లో వేగంగా దూసుకెళ్లిన సామ్సంగ్ కంపెనీ మొబైల్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక సామ్సంగ్ నుంచి గెలాక్సీ జె7 సిరీస్ బాగా అమ్ముడైన ఫోన్లు అంటారు, అలాంటి వాటిలో ఈ సంవత్సరం జులై నెలలో విడుదల అయిన గెలాక్సీ జె7 ఎన్ ఎక్స్ టి.

ఫీచర్స్: ఆండ్రాయిడ్ 7 నూగట్, 5.5" హెచ్ డి సూపర్ ఆమ్లైడ్ డిస్ప్లే, 1.6 ఆక్టా కోర్ ప్రొసెసర్, 2జిబి ర్యామ్, 3000mAh బ్యాటరీ సామర్థ్యం, 13 మెగా పిక్సెల్ కెమెరా బ్యాక్ ఫ్లాష్, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4జి,3జి నెట్ వర్క్, వైఫై, డ్యూయల్ సిమ్, జిపిఎస్, 256జిబి ఎక్స్పాండబుల్ మెమోరి కార్డు స్లాట్, 16 ,జిబి ఇన్ బిల్ట్ ఫోన్ మెమోరి తదితర ఫీచర్స్ కలిగి ఉంది. కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు.

ఈ కంపెనీ నుండి గెలాక్సీ ఆన్ ఎన్ ఎక్స్ టి మొబైల్ ఫోన్ కూడా ఇంచుమించు ఈ ధరలో లభించే అవకాశం ఉంది. తక్కువ ధరకు మంచి మోడల్స్ అంటే గెలాక్సీ జె3, గెలాక్సీ ఆన్5, సిరీస్ లో లభిస్తాయి. పదివేల రూపాయల ధర ఆధారంగా ఇతర కంపెనీ మొబైల్ ఫోన్లలో లభించే ఫీచర్స్ సామ్సంగ్ కంపెనీలొ కావాలంటే ఇంకా 3 - 6 వేల రూపాయలు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు.

అయితే ఇలా అన్ని కంపెనీల ఫోన్లు యొక్క ఫీచర్స్ విడివిడిగా కాకుండా, సాధారణంగా ఇప్పటికి అవసరమని చెప్పబడే ఫీచర్స్ చూసి అవి ఏ ఏ మోడల్స్ నందు లభిస్తుంది చూద్దాం.

అవసరం అనుకునే కామన్  ఫీచర్స్:

5 లేదా 5.5 అంగుళాల తాకే తెర, 2-4జిబి ర్యామ్, 16-32జిబి ఫోన్ మెమోరి, 4జి, 3జి నెట్ వర్క్, 8-16 మెగా పిక్సెల్ కెమెరా, 2-8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ ఫ్లాష్, డ్యూయల్ సిమ్, హెచ్ డి డిస్ప్లే, వైఫై, మొబైల్ హాట్ స్పాట్, ఓటిజి సపోర్ట్, కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000-5000 mAh బ్యాటరీ సామర్థ్యం, బ్లూటూత్, జిపిఎస్, 1.2 - 2 GHz ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 6 మార్స్ మాల్లో & 7 నూగట్ తదితర ఫీచర్స్ కలిగి ఉన్న కొన్ని రకాల మొబైల్ ఫోన్లు:

నోకియా 6, షియోమి ఎమ్ ఐ ఏ1, షియోమి రెడ్ మి నోట్ 4, మోటో జి5ప్లస్, మోటో ఇ4ప్లస్, సామ్సంగ్ గెలాక్సీ జె7 ప్రైమ్, నోకియా 5, పానా సోనిక్ ఎలుగా రే 700, వివో వి5, వివో వి5 ప్లస్, 10.ఆర్ జి, ఒప్పో ఎఫ్ 3, హానర్ 6ఎక్స్, హానర్ 7ఎక్స్, లెనోవా కె6 నోట్, కూల్ పాడ్ కూల్1, లెనోవా పి2, ఆసస్ జెన్ ఫోన్ 4 సెల్ఫి, హానర్ 8 లైట్, స్మార్టన్ ఎస్ ఆర్ టి, ఆసస్ జెన్ ఫోన్ 3 ఎస్ మాక్స్, లికో లే2, బిలియన్ కేప్చర్ ప్లస్, కార్బన్ టైటానియం జంబో 2, హానర్ హాల్లీ 4 ప్లస్, పానా సోనిక్ ఎలుగా ఐ4, ఇన్ఫోకస్ స్నాప్ 4, వైయూ యురేకా 2, మైక్రో మాక్స్ ఇవోక్ డ్యూయల్ నోట్, పానా సోనిక్ ఎలుగా ఏ3, ఏ3 ప్రో, మైక్రో మాక్స్ సెల్పి2, మైక్రో మాక్స్ ఇవోక్ నోట్, జియోనీ ఏ1, పానా సోనిక్ ఎలుగా రే మాక్స్, స్వైప్ ఎలైట్ మాక్స్, కూల్ పాడ్ నోట్ 5 మొదలైన మొబైల్ ఫోన్లలో పై ఉదాహరించిన ఫీచర్స్ లభించే అవకాశం ఉంది.

కొన్ని ఆప్స్ లేదా వెబ్ సైట్లు మొబైల్ ఫోన్ల గురించి వాటి యొక్క ఫీచర్స్ వివరాలు, వివరణ ఉంటాయి అవి కొన్ని 91 మొబైల్స్, స్మార్ట్ ఫిక్స్, మౌత్ సైట్, డిజిట్ డాట్ ఇన్, మై స్మార్ట్ ప్రైస్, గాడ్జెట్ ఎన్డిటీవి, ఫోన్ ఎరీనా మొదలైనవి.

Success Things Similar Work Things

Success Things Similar Work Things : Success Things Similar Work Things History is proved with evidence that people who are assiduous and ha...