Skip to main content

సామ్సంగ్ గాలక్సీ ఆన్ సిరీస్ నుండి కొత్త ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో

Samsung ON సిరీస్ నుండి కొత్తగా ఫ్లిప్ కార్ట్ లో Samsung Galaxy On Nxt (16 GB) 3 GB Ram జనవరి 3వ తేదిన లాంచ్ అయ్యింది. లాంచ్ ఆఫర్ గా పదివేల రూపాయలకే 5వ తేది వరకు లభించింది, ఇప్పుడు సామ్సంగ్ ఆన్ నెక్స్ట్ 16 జిబి ధర రూ. 10999/- లలో లభిస్తుంది. ఈ ధరలో ఇంతకుముందు Samsung నుండి ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ కలిగి ఉండలేదు, కానీ ఇప్పుడు ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3gb Ram, 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా, 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, అక్ట కోర్ ప్రాసెసర్, 4జి, wifi, గూగుల్ మాప్స్, 3300 mAh సామర్ధ్యం కలిగిన బాటరీ, డ్యూయల్ సిమ్, GPS, బ్లూ టూత్ 4.1, మొదలైన ఫీచర్స్ కలిగి ఉంది. అయితే ఆండ్రాయిడ్ 7 వచ్చిన తర్వాత కూడా ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 6 (మార్ష్ మాల్లో) కలిగి ఉంది కానీ ఈ ధరలో 3 GB రామ్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్, గుడ్ కెమెరా క్వాలిటీ 13 మెగా పిక్సెల్ బ్యాక్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో HD వీడియో రికార్డింగ్ చేయవచ్చు అని దీని ఫీచర్స్ పరిశీలిస్తే తెలుస్తుంది. ఓటిజి సపోర్ట్ కలిగి ఉంది, మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది అందులో మూవీస్ ఉంటే, నేరుగా పెన్ డ్రైవ్ ని ఓటిజి కేబుల్ సాయంతో ఈ ఫోనుకు కనెక్ట్ చేసి వీక్షించ వచ్చును (పెన్ డ్రైవ్ నుండి మూవీస్ ని మొబైల్ కాపీ చేయవలసిన అవసరం లేకుండా). 256 GB వరకు మెమరీ కార్డు ద్వార స్టోరేజ్ పెంచుకోవచ్చు. బ్రాండెడ్ ఫోన్ అంటే తక్కువ ధరలో మంచి ఫోన్ ఇదే, అదే వేరే బ్రాండ్ ఫోన్లలో ఇదే ధరలో ఇంకా మంచి ఫీచర్స్ లభిస్తాయి కానీ Samsung ఫోన్లు వాడుక అలవాటు అయిన వారికీ మాత్రం Samsung Galaxy On Nxt (16 GB) 3GB Ram మంచి ఫోన్. బ్లూ రంగులో కనిపిస్తున్న అక్షరాలపై క్లిక్ గాని టచ్ గాని చేసి మీరు నేరుగా ఆ మొబైల్ వివరాలు చెక్ చేసుకొని, కొనుగోలు చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

డి యు స్క్రీన్ రికార్డర్ ఆప్ గురించి తెలుసుకుందాం

మన మొబైల్  వినియోగించే విధానం వీడియోగా మార్చాలంటే మాత్రం మనకు కావలసిన ఆప్ స్క్రీన్ రికార్డర్, ఇవి గూగుల్ ప్లే స్టోర్లో స్క్రీన్ రికార్డర్ లేదా దానికి వీడియో ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉండి లభిస్తాయి, అలాంటి వాటిలో ఒక ఆప్ డియు స్క్రీన్ రికార్డర్ గురించి తెలుసుకుందాం!మీరు గూగుల్ ప్లే స్టోర్లో DU Screen recorder అని టైపు చేసి ఈ ఆప్ ను మీ ఫోన్, ఫ్యాబ్, టాబ్స్ నందు ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ఈ ఆప్ ఓపెన్ చేస్తే, మీ డివైజ్ స్క్రీన్ పైన Recorder is ready అనే పేరుతో నోటిఫికేషన్ వస్తుంది, ఇంక మీరు ఆప్ క్లోజ్ చేసి,
మీ స్క్రీన్ రికార్డు చేయవచ్చు. స్క్రీన్ పై ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ఎలా వినియోగించింది, వినియోగిస్తున్న అప్పుడు స్క్రీన్ పై జరిగినదంతా ఈ DU Recorder ఆధారంగా రికార్డు చేసి వీడియోగా చూడవచ్చు.అంతేకాకుండా మీరు కెమెరాతో తీసిన వీడియోలు కూడా ఎడిటింగ్, కొన్ని వీడియోలు ఒకటిగా మెర్జ్ చేయవచ్చు. జిప్ ఫార్మాట్లలో స్క్రీన్ రికార్డు చేయవచ్చు, ఈ ఆప్ కుడి వైపు పైన ఉన్న సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి మీకు ఆప్ ఆప్షన్లు కనిపిస్తాయి, ఆక్కడ మార్పు చ…

క్రోమ్ కాస్ట్ వీడియో స్ట్రీమింగ్ డివైజ్

క్రోమ్ కాస్ట్ తో మీ మొబైల్ లేదా టాబ్స్ నందు కనిపించే స్క్రీన్, మీ టీవీ లో చూడడానికి ఉపయోగపడుతుంది. మీ మొబైల్ లేదా టాబ్స్ నందు మీరు ఆడే గేమ్స్ లేకా చూస్తున్న వీడియోలు పెద్ద స్క్రీన్ పై అంటే టీవీ లో చూడవచ్చు లేదా గేమ్స్ ఆడవచ్చు, అయితే మీ టీవీ లో హెచ్ డి ఎమ్ ఐ పోర్టు ఉండాలి. ఇది గూగుల్ సంస్థ యొక్క ఉత్పాదన, మరియు బాగా ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే ఇది స్మార్ట్ ఫోన్ ద్వారా మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మారుస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు మీ మొబైల్ నుండి మీ టీవీలో ప్రసారం చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వెబ్ సైట్లు పెద్ద స్క్రీన్ పై చూడవచ్చును. ఇది ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ యాప్ / వెబ్ సైట్ లో లభిస్తుంది.